| శ్రీరామ | |
| ఈ ” సనాతన సాధక సమష్టి ” ఉద్యమం గురించి : | |
| 1) | సనాతన : |
| సనాతనం అనేది ఒక మతం కాదు. అది ఒక ధర్మం ! | |
| అభ్యుదయ కరమైన ఒక శాంతియుత సహ-జీవన విధానం ! | |
| మన నిత్య జీవితంలో, దినచర్యలో, వ్యవహార సరళిలో, | |
| మానసిక దృక్పథంలో నిక్షేపించబడి – తరతరాలుగా మన | |
| జన జీవన స్రవంతిగా వస్తూ ఉన్నది ఈ సనాతన ధర్మం. | |
| మారుమూల కుగ్రామంలో నున్న నిరక్షరాస్యులు కూడ - | |
| స్త్రీ పురుష భేదం లేకుండా – ఏది ధర్మమో ఏది న్యాయమో | |
| చెప్ప గలిగేంతగా మన జాతి సంస్కృతిలో జీర్ణించి పోయింది | |
| ఈ సనాతన ధర్మం ! | |
| ఇట్టి సనాతన జీవన విధానపు మూలాలు | |
| వేదమూలకమైన భారతీయ సంస్కృతిలో ఉన్నాయి ! అందుకే | |
| వాటిని గురించిన అవగాహన కలిగించటం మన మొదటి ప్రక్రియ ! | |
| 2) | సాధక : |
| విన్న మంచిని ఆచరణలో పెట్టేందుకు | |
| చిత్తశుద్ధితో ప్రయత్నించేవారే సాధకులు. | |
| ” ఈ రోజులలో ఈ భావాలు ఆచరణ-యోగ్యములా ? | |
| ఆచరణ-సాధ్యములా? ఏ స్థాయి వారికి ఏ సాధనలు చెప్పబడ్డాయి ?” | |
| అనే ఆశంకలకు సమాధానం దొరికితే, సాధకులకు చాలా | |
| ఉపయోగకరంగా ఉంటుంది గదా ! | |
| అందుకే, సాధనా మార్గంలో సోపానక్రమం చూపించటానికి | |
| ప్రయత్నించటం మన రెండవ ప్రక్రియ ! | |
| 3) | సమష్టి : |
| నేటికాలంలో అతి వేగంగా మానవ జీవన విలువలు అంతరిస్తున్నాయి. | |
| ఈ పతనక్రమం నుంచి జాతిని కాపాడి నిలబెట్టాలంటే - | |
| విడి విడి వ్యక్తుల మొత్తం శక్తి కన్న బలవత్తరమైన సంఘశక్తి, | |
| సంఘజీవనం అవసరం. అందుకనే సమష్టి బృందాల నిర్మాణానికి | |
| ప్రాముఖ్యం ఇవ్వటం మన కార్యక్రమం యొక్క విశిష్టత ! | |
| వారానికి ఒక రోజు కలిసి కూర్చుని, మన సనాతన ధర్మానికి, | |
| సంస్కృతికి, జాతికి, దేశానికి, సమాజానికి మనం ఏవిధంగా సేవ | |
| చేయగలం? వచ్చే అడ్డంకులని ఏ విధంగా దాటే ప్రయత్నం | |
| చేయవచ్చు ? ఎవరం ఏవిధంగా ప్రయత్నం చేస్తున్నాం, | |
| సాధక బాధకాలేమిటి? అని - | |
| సమస్యలను, వాటి మూల కారణాలను, వాటికి పరిష్కార మార్గాలను | |
| చర్చిస్తూ, ఆచరణ శీలమైన పరస్పర ప్రబోధక ప్రచోదక వాతావరణాన్ని | |
| కల్పించుకోవటమే – మన సనాతన సాధక సమష్టి యొక్క | |
| మూడవ ప్రక్రియ ! | |
3:11 అపరాహ్నం వద్ద 19/03/2010 |
మీ ప్రయత్నం అభినందనీయం.