| శ్రీరామ | ||
| మా గురించి ( About Us ) : | ||
| 1) | ” సనాతన సాధక సమష్టి ” – రాజకీయాలతో సంబంధం లేని, | |
| ఆర్థిక లాభాపేక్ష లేని, నిస్స్వార్థమైన – జాతీయ, సామాజిక, | ||
| సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఉద్యమం. | ||
| 2) | జగద్గురు స్థానంలో ఉండి, అన్ని జాతులకూ అన్ని దేశాలకూ | |
| అనేక వేల సంవత్సరాలుగా శాంతి – అభ్యుదయ కరమైన | ||
| జ్ఞానభిక్షను ప్రసాదిస్తూ వస్తూన్న మన భారత జాతిలో - | ||
| గత కొన్ని శతాబ్దాలుగా, మరీ ముఖ్యంగా స్వాతంత్ర్యానంతర | ||
| కాలపు కొన్ని దశాబ్దాలుగా కనిపిస్తున్న - | ||
| విలువల పతనం, పరభాషా – పరసంస్కృతీ – విదేశీ వ్యామోహాలు | ||
| ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి ! | ||
| 3) | దేశభక్తులు, ఆలోచనాపరులు ఈ దిగజారుడుదనానికి గల | |
| మూల కారణాలను విశ్లేషించి, పరిష్కార మార్గాలను | ||
| సూచించేందుకు; ప్రతివారూ అవకాశం కలగజేసుకుని మరీ | ||
| వాటిని సూత్రప్రాయంగానైనా ఆచరణలో పెట్టటానికి | ||
| నడుం బిగించేందుకు వలసిన స్ఫూర్తినిచ్చేందుకు - | ||
| ఏర్పడినది ఈ ఉద్యమం. | ||
| 4) | డా || బ్రహ్మశ్రీ వేమూరి పూర్ణానందం, M.A.(Litt.), M.A.(Philosophy), | |
| Ph.D (Philosophy),మహాశయులు | ||
| శ్రీ విభవ నామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి ( శంకర జయంతి ), | ||
| సోమవారం (13th May, 1928 ) నాడు తెనాలి తాలూకా కుంచవరం | ||
| గ్రామంలో జన్మించారు. 17 సంవత్సరములు కాశీవాసం చేసి కాశీ హిందూ | ||
| విశ్వ విద్యాయలంలో అధ్యయనం, పరిశోధన చేశారు. | ||
| ఆజీవన బ్రహ్మచర్యం పాటిస్తూ, 1956 సం.లో ఈ సంస్థను స్థాపించి, | ||
| చాలామందికి స్ఫూర్తిప్రదాతలుగా ఉంటూ వస్తున్నారు. | ||
| వారే ఈ ఉద్యమానికి రూపశిల్పి, వ్యవస్థాపక అధ్యక్షులు, | ||
| మరియు సర్వోపద్రష్ట. | ||
| వారి నివాసస్థలం తెనాలి తాలూకా – కుంచవరం గ్రామం. | ||
| ఈ సమష్టి ఉద్యమం కోసం విస్తృతంగా పర్యటిస్తూంటారు. | ||
| 5) | ఈ ప్రస్థానంలో వారికి చేదోడు వాదోడుగా ఉంటూ, అంకిత భావంతో | |
| జీవితాంతం కృషి సల్పిన సమష్టి సభ్యులు : | ||
| కీ.శే. తంగిరాల శ్రీనివాసులు గారు, | ||
| కీ.శే. గానుగపాటి శ్రీరామ శర్మ గారు, | ||
| కీ.శే. పిడూరి సత్యనారాయణ గారు, …మున్నగు వారు. | ||
| 6) | ప్రస్తుతం మన సమష్టి సమావేశములు ఈ క్రింది కేంద్రములలో | |
| నిశ్చితంగా నడుస్తున్నాయి : | ||
| హైదరాబాదు, సికిందరాబాదు, విజయవాడ, అనపర్తి, మున్నగు ఊళ్ళలో.. | ||
| 7) | ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మీడియా బ్లాగు స్థాపన ద్వారా, సభ్యులు, | |
| కార్యకర్తల మధ్య, క్రొత్తగా చేరగోరే ఔత్సాహికుల మధ్య | ||
| సమాచార సౌకర్యం పెరగటం ద్వారా - | ||
| దేశం లోని అన్ని ప్రాంతాలలోని సాధకులు, | ||
| విదేశాలలోని సాధకులు ( NRI s ) కూడ | ||
| ఈ సమష్టి-నిర్మాణ, విచార-వినిమయ, ఆచరణాత్మక | ||
| కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, | ||
| దేశాభ్యుదయానికి జాతిపురోగతికి | ||
| తమ వంతు సేవలు అందిస్తారని ఆశిస్తున్నాము ! | ||
టాగులు: భారతీయ సమాజం