కార్యాచరణ ప్రణాళిక ( our PLAN of ACTION )

శ్రీరామ
సనాతన సాధక సమష్టి – ఆశయాల సాధనకు – కార్యాచరణ ప్రణాళిక:
( our PLAN of ACTION to achieve ENDS through MEANS :
1) భారతీయ సనాతన జీవన విధానపు ప్రాశస్త్యంపై అవగాహనను
పెంచటం ద్వారా – సాంస్కృతిక  పునరుజ్జీవనం.
(అ) భారతీయ సనాతన సంస్కృతీ విలువలు అంటే ఏమిటో,
వాటి ప్రయోజనాలు, గొప్పదనం తెలియజేయటం.
(మానవ సాధారణ ధర్మాలు, ధార్మికత,
భాషా, సాహిత్యం, లలిత కళలు, పండుగలు – వ్రతాలు,
ఆచార-వ్యవహారాలు, విశాల దృక్పథం, శాంతి కాముకత,
ఇహ-పర సాధన, భగవద్భక్తి, ఆధ్యాత్మికత, మొ.)
(ఆ) భారతీయ సామాజిక పునాదులు ఏమిటో తెలియజేయటం.
మన మహర్షులు అందించిన వివాహ వ్యవస్థ, కుటుంబ
వ్యవస్థ, ధార్మిక ( నీతి,  న్యాయ ) వ్యవస్థలు ప్రపంచం
మొత్తంలోమన దేశంలోనే స్థిరంగా నేటికీ నిలిచి ఉన్నాయి !
వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు ఏమిటో తెలియజేయటం.
వర్ణాశ్రమ వ్యవస్థ యొక్క – ఔచిత్యం, దీనివల్ల వ్యక్తులకి,
కుటుంబానికి,భావితరాలకి,సమాజానికి చేకూరే ప్రయోజనం,
స్వధర్మానికి గల గౌరవం (Dignity of Labour ),
వ్యతిరేకతకు అసలు కారణాలు, మొ. తెలియజేయటం.
ఈ రోజులలో వర్ణాశ్రమ ధర్మ పాలన ఉచితమా, సాధ్యమా?
మరి సనాతన – అధునాతనాలకు సమన్వయం ఎలా ?
వర్ణాలు జన్మతః వచ్చేవా ? లేక గుణ-కర్మల వల్ల వచ్చేవా?
ఎవరు ఎట్లా భావించాలి ?
మొ. విషయాల అవగాహన కలిగించటం.
2) సనాతన విలువలు, అధునాతన పద్ధతులు – ఉభయతారక
జీవనవిధాన సూచన. (సనాతన విలువల మూలాలతో -
ఆధునిక ధోరణుల సమన్వయం) ద్వారా – సామాజిక పునరుజ్జీవనం.
(అ) ఒక్కొక్క సనాతన విలువను గుర్తించటం ; దాని ప్రయోజనం
తెలియజేయటం; అది ఈ రోజులలో ఎంతవరకు
ఆచరణ సాధ్యం, అభిలషణీయం అనే విషయం చర్చించటం;
విలువలను సూత్రప్రాయంగానైనా పరిరక్షించుకునే
ప్రయత్నం ఆచరణలో పెట్టటం ( to preserve the values
more ( at least ) in spirit ).
సనాతన విలువలు అంటే – ఉదాహరణకు :
ప్రకృతి అనుగుణ జీవన విధానం;
కాల నియమ ( సమయ ) పాలన;
పూర్వ కర్మ ఫలం – ఉత్తర గతులు;
భౌతికత కన్న ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇచ్చే దృక్పథం;
భగవత్ నిర్గుణ తత్త్వాన్ని అర్థం చేసుకుంటూ -
ఇష్ట ( కుల ) దైవాన్ని సగుణంగా ఆరాధించే విధానం;
మానవ ( సర్వ జంతు ) సహజ స్వభావమైన ” అర్థ,
కామాసక్తి”కి “ధర్మం ” అనే పరిమితులు విధించుకోవటం
ద్వారా శాంతియుత సామాజిక అభ్యుదయం;
స్వార్థం, పరార్థం, పరమార్థములలో ఉత్తరోత్తరా ప్రాధాన్యం;
అహంకార రాహిత్యం (Annihilation of Ego )
దానం, త్యాగం, ఔదార్యములలోనే అధిక ఆనందం పొందటం!
మానవ జీవిత సాఫల్యానికై చతుర్విధ పురుషార్థ సాధన,.
మున్నగునవి …
3) వ్యక్తి ఉన్నతికి – ఆధ్యాత్మిక శిఖరాలవరకూ – సాధనా సోపాన
మార్గ దర్శనం ద్వారా – అత్యుత్తమమైన మానవ జన్మ సార్ధకత.
(అ) చతుర్విధ పురుషార్థములలో  : ఇహ – పర సాధనములు-
ధర్మ, అర్థ, కామములు – అవగాహన.
(ఆ) చతుర్విధ పురుషార్థములలో  – ఆధ్యాత్మిక సాధనము:
మోక్ష పురుషార్థము – అవగాహన.
కర్మ, ధ్యాన, భక్తి, జ్ఞానయోగములు.
4) భారత జాతి ఆత్మగౌరవం, జాతి ప్రతిష్ఠ, జాతి ప్రయోజనాలు
నిలపటానికై, సర్వసంసిద్ధత ద్వారా – భారత జాతీయతా స్ఫూర్తిని
పెంపొందించటం.
(అ) జాతి అంటే ఏమిటి?
(ఆ) భారత జాతి అంటే ఏది?
(ఇ) జాతీయతా భావన అంటే ఏమిటి?
(ఈ) జాతి ఆత్మగౌరవానికి మూలం – మన జాతి యొక్క
గొప్పదనం గుర్తించటమూ, దృఢవిశ్వాసం కలిగి ఉండటమే.
(ఉ) ” జాతి ప్రతిష్ఠను నిలబెట్టటం ” అంటే – ఇతర జాతీయులు
( ఏ ఉద్దేశ్యంతో నైనా గానీ ) మన జాతి గౌరవానికి
భంగకరంగా మాట్లాడటం, ప్రవర్తించటం చేస్తున్నప్పుడు,
ఊరుకోకుండా తగిన విధంగా ప్రతిస్పందించటమే.
ఇతరులు ఆ విధంగా మాట్లాడేందుకు అవకాశం ఇస్తూ,
మన జాతీయులే మన స్థాయికి తగని విధంగా ప్రవర్తిస్తూ
ఉన్నప్పుడు, వారికి తగిన విధంగా కనువిప్పు కలిగించటం.
(కుటుంబ ప్రతిష్ఠ విషయంలో అందరూ చేస్తూండేది ఇదే !)
(ఊ) ” జాతి ప్రయోజనాలు నిలపటం ” అంటే – వాటికి భంగకర
మైన అంశాలను గుర్తించి, నిరోధించటం, ప్రతిఘటించటం.
దీనికై సమష్టి బలం ఎంతో అవసరం -
ఉదాహరణకు : -  ఇప్పుడు విదేశీ Universities కి
తలుపులు బార్లా తెరవటం వల్ల మన విద్యా సంస్థల
మనుగడయే ప్రశ్నార్థకం అయ్యేట్లు తీసుకున్ననిర్ణయాలు
జాతి ప్రయోజనాలకొరకా? లేక ఎవరి ప్రయోజనాల కొరకు?
లోతుగా విమర్శ చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది !
(ఋ ) ” సర్వ సంసిద్ధత ” అంటే – తను, మన, ధన, ప్రాణాలను
పణంగా పెట్టైనా సరే, వ్యక్తిగత ప్రయత్నాలే కాకుండా
సంఘ ( సమష్టి ) బలం కూడా సమీకరించటం, అందరికీ
అవగాహనాస్థాయిని పెంచటం, చైతన్య పరచటం,
జాగృతం చేయటం.
(ౠ) ” జాతీయతా స్ఫూర్తి ” అంటే – పైన చెప్పిన అంశాలు,
కర్తవ్యాలు స్ఫురిస్తూ ఉండటం. కర్తవ్యం స్ఫురించాక,
” నా శక్తివంచన లేకుండాఆచరిస్తాను ” అనే దృఢనిర్ణయం
చేసుకుంటూ ఉండటం, కార్యాచరణకు దిగటం,
అవసరమైన మేరకు జనచైతన్యాన్ని జాగృత పరచటం.
Better to follow  ” both  in  LETTER and SPIRIT “.
Even if it becomes difficult to follow  in LETTER;
the SPIRIT  should never be allowed to dwindle.
5) ” సనాతన సాధక సమష్టి ” నిర్మాణం ( ఆమోదకుల, పోషకుల,
జిజ్ఞాసువుల, ధార్మికుల, సాధకుల – సమష్టి బృందాల
నిర్మాణం, అనుసంధానం)
(అ) సమష్టి బృందాల సభ్యత్వము,  బృందాల సంఖ్య పెంచటం
ద్వారా – మంచిని కోరేవారి, మంచిని చేసే వారి సంఘీకృత
బలాన్ని పెంచటం.
(ఆ) మన కార్యకర్తల పరిచయంలోనికి వచ్చిన ఔత్సాహికుల
వివరాలు- పేరు, ఫోను నెం, ఇ-మెయిల్, గ్రామం, పట్టణంలో
పేట, మొ. – ప్రాంతంవారీగా ఈ బ్లాగులో ప్రచురించటం.
దీనివల్ల, అలాంటి వ్యక్తులు కూడ తమకు సన్నిహిత
ప్రాంతంలో ఉన్న like – minded persons తో సంబంధం
ఏర్పరచుకునే వీలు కలుగుతుంది.
దేశం లోని అన్ని ప్రాంతాలలోని తెలుగువారూ,
విదేశాలలోని తెలుగువారు ( NRI – Andhras ) కూడ
లబ్ధి పొందటానికై ఈ బ్లాగు నిర్వహణ చాలా దోహదకరం.
(ఇ) దగ్గర దగ్గరగా ఉన్న ఏ ఇద్దరు వ్యక్తులైనా కలిసి వారానికి
ఒక రోజు పరస్పరం భావ వినిమయం, ఆచరణలో ప్రగతిని
పరిశీలించుకుంటూంటే అది ఒక సమష్టి బృంద నిర్మాణం
జరిగినట్లే !
ఒకే ఊరి ( పట్టణంలోని ) అనేక బృందాల సభ్యులు
నెలకు ఒకసారి కలిసి కూర్చుంటే, సమష్టి బంధం
విస్తృతమూ, బలోపేతమూ, అధిక ప్రయోజనకరమూ
అవుతుంది.
తమ ప్రాంతానికి సమీపంలో రెండవ వ్యక్తి లేని
ఔత్సాహికులు కూడ, వారానికి ఒకసారి ఈ బ్లాగును తెరిచి,
మార్పులు చేర్పులు, క్రొత్త విషయాల కోసం పరిశీలించే
అలవాటు , తమ భావాలను ఈ బ్లాగులోనే వ్యాఖ్యల
రూపంలో అందించే అలవాటు చేసుకుంటే; వారు కూడ
ఈ ” సనాతన సాధక సమష్టి ” ఉద్యమంలో సభ్యులైనట్లే !
వారుకూడ మన జాతి, దేశ, సంస్కృతీ విషయాలలో
పాలు పంచుకుంటున్నామన్న ఆత్మసంతృప్తిని
పొందదగిన వారే !
(ఈ) పైవిధంగా నిర్మితమైన సమష్టి బృందాల కార్యకర్తలకు,
సభ్యులకు అవసరమైన కనీస విషయ పరిజ్ఞానం ఈ
బ్లాగు ద్వారా పొందవచ్చు. తమ సందేహాలను కూడ
ఇందులో అడగవచ్చు. ఈ బ్లాగు ” అనుసంధాన కేంద్రం “గా
వ్యవహరిస్తుంది కాబట్టి, సర్వులకు, సర్వకాల సర్వావస్థల
యందు కరదీపికలా అందుబాటులో ఉంటుంది.
(ఉ) మనది రాజకీయాలకు అతీతమైన, నిస్స్వార్థమైన, కేవలం
సంస్కృతీ విలువల, జాతి వారసత్వ పరమైన తపన గలిగిన
ఉద్యమం కాబట్టి, ఇందులో పాల్గొనదలచిన ఔత్సాహికులకు
సభ్యత్వ రుసుములు, చందాలు, విరాళాల ప్రసక్తే లేదు.
దేశంపట్ల, సంస్కృతీ విలువలపట్ల, జాతిగౌరవంపట్ల
అంకితభావం ఉన్నవారందరూ మన సభ్యులే !
వారికి స్వంత కంప్యూటర్ లేకపోయినా సరే,
E-Mail ID ఉంటే చాలు; కనీసం ఒక ఫోను నెం. ఉంటే చాలు.
అవి లేని సభ్యులు వెంటనే అవి పొందే ప్రయత్నం చేస్తే చాలు.
6) సంతతి శ్రేయస్సు – అనగా మన ఘన వారసత్వపు సాంస్కృతిక,
నైతిక విలువలు అందించటం ద్వారా, మన వారసుల – భావి తరం -
నేటి బాలల యొక్క వ్యక్తిత్వ వికాసానికి, సుఖ శాంతులకు
దోహదం చేయటం.
(అ) భారతీయ సంస్కృతీ సాహిత్య పరిచయము
( సంస్కృత సూక్తులు, శ్లోకాలు )
(ఆ) మాతృభాష సంస్కృతీ సాహిత్య పరిచయము
(తెలుగు సూక్తులు, పద్యాలు)
(ఇ) ఆలోచనాశక్తి, విచక్షణాశక్తి, సృజనాత్మకతలు మౌలికంగా
మాతృభాషలో వికసించినట్లుగా పరభాషలలో వికసించవు.
ముందు ఈ మౌలిక శక్తులు సంపాదిస్తే, ఇంగ్లీషుతో సహా
ఏ భాషలోనైనా సరే – చక్కని భావ, పదజాలంతో – వ్రాసే,
మాట్లాడే నేర్పులు సహజంగా, అనాయాసంగా కలుగుతాయి.
(ఈ) ఆంగ్లభాషలో కూడ – మన వాతావరణం, సంస్కృతి,
విలువలు ప్రతిబింబించే  Quotations, stories and
content (with Indian Environment) నేర్పించటం.
( This can happen only outside the
School – corriculum ! )
7) భారతమాత ముద్దు బిడ్డలుగా – విభిన్న సామాజిక వర్గాల మధ్య -
సహోదర భావం, పరస్పర సదవగాహన,
విలువలతో కూడిన జీవితం పట్ల ఆదరణ, ఆచరణ పెంచటం ద్వారా -
భారత దేశంలోని అందరికీ శాంతియుత అభ్యుదయం.
(అ) ఏ జాతి, సమాజపు పురోగతికైనా ఆవశ్యకమైన అంశాలు
ఏమిటో, అవి మన సనాతన జీవన విధానంలో
ఇతర సమాజాలకన్నా ప్రశస్తతర పద్ధతిలో ఏ విధంగా
ఇమడ్చబడ్డాయో అవగాహన కల్పించటం.
(ఆ) ఒక యంత్రపు గొలుసు ( chain ) లోని ప్రతి లింకు
ముఖ్యమైనట్లే, సమాజ భవనపు ప్రతి స్తంభమూ
( ప్రతి సామాజిక వర్గమూ ) ప్రాముఖ్యం కలిగినదే.
ఎవరి ధర్మాన్ని వారు సక్రమంగా నిర్వర్తించటమే
వారు చేసే ” లోకోద్ధరణం ”లో మొదటి మెట్టు
అనే అవగాహన కలిగించటం.
(ఇ) ఒక కుటుంబంలోని వ్యక్తులు ఏ విధంగానయితే -
మొత్తం కుటుంబంయొక్క అభ్యుదయంకోసం తమ తమ
వ్యక్తిగత స్వార్థాలను సర్దుబాటు చేసుకుని, సమన్వయ
పరచుకుంటూ, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారో, అలాగే -
జాతియొక్క ఆత్మగౌరవం పెంచటంలో తమ అధికారాలే
కాక, తమ వంతు బాధ్యతలను కూడ నిర్వర్తించాలి
అనే అవగాహన కలిగించటం.
(ఈ) తమ తమ బాధ్యతల ప్రసక్తి ఏమాత్రమూ లేకుండా,
తమ తమ హక్కులకోసం మాత్రమే పోరాడేందుకు రెచ్చగొట్టే
సంకుచిత స్వార్థపర రాజకీయ నాయకులను అమాయకంగా
అనుసరించటమే – ప్రస్తుత కాలంలో సామాజిక
వర్గవైషమ్యాలకు, అశాంతికి మూల కారణాలు -
అనే అవగాహన కల్పించటం.
8) విశ్వశాంతికై భారతీయ సనాతన ధర్మం శరణ్యం -
అనే సత్యాన్ని ఆవిష్కరించటం.
(అ) ” లోకో భిన్న రుచిః “.  భిన్నత్వం లోక-సహజమే.
ఆ సగుణ భిన్నత్వంలోనే -  నిర్గుణ ఏకతత్త్వ (  ఏకత్వ )
దర్శనం చేయగలిగిన మహనీయులు మన మహర్షులు !
ఎవరికి వారికి భావస్వాతంత్ర్యము, సాధనాస్వాతంత్ర్యము
ఇస్తూ, ” అందరి గమ్యం ఒక్కటే – మార్గాలే అనేకం ” అనే
విశాల సత్యాన్ని ఆవిష్కరిస్తూ, అన్నిటినీ తనలో
ఇముడ్చుకునే విశాల, ఉదార, సహనశీల, శాంతియుత-
సహజీవన ఆకాంక్ష కలిగిన సమాజాన్ని  నిర్మించటంలో
కృతకృత్యులైనారు. విశ్వశాంతి స్థాపనకు
ఇంతకంటే దోహదకరమైన సమాజం, సంస్కృతీ లేవు -
అనే అవగాహన కలిగించటం.
9 సింహావలోకనం చేసుకుంటే -
సనాతన ధర్మం, సంస్కృతి, జీవన విధానాల గురించి -
పెద్దల దగ్గర విషయాలను అవగాహన చేసుకోవటం.
సాటివారి దగ్గర చర్చలు, పరస్పర ప్రబోధాలు చేసుకోవటం.
పిన్నవారి దగ్గర అవగాహన కలిగించటం, బోధించటం.
Awareness ( అవగాహన ) కలిగించటమే కాకుండా,
స్వయంగా ఆచరించే ప్రయత్నం చేయటం.
ఎవరికి ఎప్పుడు ఎందుకు ఏయే సాధనలు చెప్పబడ్డాయి?
అనే వివేకంతో తనకు కర్తవ్యమైన వాటిని తాను ఆచరించటం.
ఉన్నతస్థాయి సాధనలను చేసేందుకు సమయం చాలదు
అనిపిస్తే,  క్రిందిస్థాయి వాటిని వదిలిపెట్టి, చేయవచ్చు
అనే వివేకయుత ధైర్యం.
ఉదా: ధ్యానసాధన చేయదలుచుకున్న వారు
సమయం చాలనప్పుడు పూజ, జపం వంటి వాటిని
సంక్షేపించుకోవటం ( తగ్గించుకోవటం ) వల్ల
లాభమే కాని నష్టం ఎంతమాత్రమూ లేదు.
సారాంశం: అధీతి – బోధ – ఆచరణలు.

టాగులు: , , ,

ఒక స్పందన to “కార్యాచరణ ప్రణాళిక ( our PLAN of ACTION )”

  1. sasikumart అన్నారు:

    When the entire world is looking at India to guide them towards Spirituality, and more & more foreigners are attracted towards Hindu systems like Yoga, etc., it is the prime responsibility of every Indian and particularly to every Hindu to learn the basics of our ancient culture, and try to implement them. If each person can atleast convince one more person, there would be a great change in the society. It is believed that the parts of our ATHARVANA VEDA are taken away by the foreigners during so many invasions, and the concept of misciles is used with the knowledge derived from the Veda. Even Germans have named their air lines LUFTHANSA after the Luft (Air borne) Hansa (Hamsa). It is high time that the Hindus should try to learn more of our ancient philosophy and try to contribute their mite in the wide spread of knowledge.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )


Follow

Get every new post delivered to your Inbox.