శ్రీరామ
ధ్యానం ఎట్లా చెయ్యాలి?
ధ్యానము ఒక మానసిక ప్రక్రియ.
బహిర్ముఖముగా నున్న ఇంద్రియములను మరల్చి, సుఖాసనములో
కూర్చుండి, మనస్సుతో ” నాకు సుఖము, శాంతి కలుగుగాక!” అని
దైవప్రార్థన చేస్తూ, మనస్సుతో ఇష్ట దైవం యొక్క రూపాన్ని
తల్చుకుంటూ, నామాన్ని జపిస్తూ, కూర్చోవటమే ధ్యానం..
రూపం కన్నా నామం గొప్పది; రూపం కనబడినా, కనబడకపోయినా,
లేక వేరే రూపం కనబడినా, నామం మాత్రం మార్చకూడదు.
ఎందుకంటే, మనస్సు యొక్క చంచలత్వం పోయి, స్థిరత్వం రావాలి కాబట్టి.
నామం కన్నా తత్త్వం గొప్పది కాబట్టి, అదే నామాన్ని కొనసాగిస్తూ,
ఆ పరమాత్మ నా లోనే కాదు; అందరిలోనూ నిహితమై ఉన్నాడు – అన్న
భావనతో ధ్యానం కొనసాగించాలి.
ఇక్కడ, నాకు కలుగు సుఖం, శాంతి, ఆనందం అందరకూ కలుగు గాక -
అన్న భావన చేస్తూ ధ్యానం చేయాలి.
ఈ భావనలో స్థిరపడిన తరువాత, “పరమాత్మ అందరిలోనే కాదు;
లోపలా బయటా అంతటా ఆ పరమాత్మ నిండియున్నాడు”;
అనగా ” అంతా రామమయం – జగమంతా రామమయం “;
” అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః “
అన్న ఏకాత్మ భావనలో మనస్సును స్థిరముగా ఉంచుటయే
సమాధి స్థితి.
దీనివలన మనస్సుయొక్క బహిర్ముఖత్వము పోయి అంతర్ముఖత్వంలో
నిలబడుటకు దోహద పడును.
దీనికి గాను సత్సంగం, సద్గ్రంథ పఠనం, సద్బోధ, సద్భావనల ద్వారా
నిర్మోహత్వము, నిశ్చలత్వము కలిగి; తద్ద్వారా సత్కర్మ – అనగా
లోకసంగ్రహార్థం నిష్కామ కర్మ – ద్వారా చిత్తశుద్ధిని బడసి,
ఆత్మజ్ఞానమును పొంది, ఆ జ్ఞానముతో పరమాత్మ దర్శనమును
పొందుటకు వీలగును. ఆత్మజ్ఞానము కలుగుటయే ” మనోలయము”, “
మనో-నాశనము” అంటారు. అదే జీవన్ముక్త స్థితి !
NOTE :
Please click on the Title of this Blog at the top
of this Post. Side-bar will be visible. Then you
may click on various related topics of your interest.
KHAJAANAALU ( Archives ) gives the posts
of each Month in date-order.
VARGA MEGHAM ( Categories Cloud ) gives all
posts of that Category ( Topic ) together at one place.
ITEEVALI JAABULU ( Recent Posts ) shows the
recent Posts, the latest – at the top of the list.
There are ” PAGES ” also in the Side – Bar,
for ALL – TIME REFERRABLE TOPICS.
టాగులు: ధ్యాన పద్ధతి, ధ్యానం, యోగ, Meditation, Yoga
3:58 అపరాహ్నం వద్ద 01/07/2011 |
ప్రపంచము నందు ఎన్నో తెలియని విషయములుండును. వానిని తెల్సుకొనుటకు మానవునకు ఒక జీవితము చాలదు. అందులోనూ ఆధ్యాత్మిక విషయములు గురు ముఖము గా విన్నగాని అవగతము గావు. కనుక సత్ గురువు నాశ్రయించి, మనసును గురు పాద పద్మములపై లగ్నము జేసి, అత్యంత గౌరవము, భక్తితో సేవించిన, గురు కృపకు ప్రాప్తుడై, అచిరకాలములో అజ్ఞానము వీడి, సంసార బంధముక్తుడై, సాధన మార్గము నెఱగి, ఇంద్రియ నిగ్రహము, మనస్సుపై జయము సంపాదించి, ఆత్మసాక్షాత్కారము పొంద గలడు. కనుక శ్రీఘ్రముగా పరమాత్మను చేర వలెనన్న సత్ గురువు యొక్క కృప ఎంతయో అవసరము.
6:37 అపరాహ్నం వద్ద 09/12/2010 |
ayya dhyanam maanasikam kaadu
japaalu nammalu dhyanam kaaadu
alochane agite ne dhyanam
mundu ramudu geemudu ane matam mattu vadalaali
12:58 అపరాహ్నం వద్ద 07/07/2010 |
cheppinadi bagane vundi..kani acharana kavaali..appude dhyanam sampurnam..
tqs.
rama.
4:28 అపరాహ్నం వద్ద 05/07/2010 |
Ayya Namaskaram,
Dhyanam gurchi chala simple ga andariki Acharaneeya yogya maye
tatlu chepparu. chala bagundi.
itlu
mee mitrudu
Sd/sastry
10:38 అపరాహ్నం వద్ద 04/07/2010 |
repected sir
chala easy ga artham ayyela chepperu
many thanks
sastry