అష్టాంగ యోగం – 1 ( యమం )

మన భారతీయ సంస్కృతిలో ప్రతి సాధనా ఒక యోగమే .  కర్మగానీ, భక్తిగానీ, జ్ఞానం గానీ సంపూర్ణంగా ఫలించాలంటే, దానిని యోగ పద్దతిలో సాధించుకోవాలి. Yoga is a technique that can be combined with, and utilised for achieving, anything!

ఆ యోగానికి అష్టాంగములు ఉన్నాయి . అవి – యమ, నియమ, ఆసన, ప్రాణాయామ,

ప్రత్యాహార, ధారణా, ధ్యాన, సమాధులు – అనే ఎనిమిది.

అందులో మొదటి మెట్టు అయిన ” యమము ” ను గురించి ప్రస్తుతం చూద్దాం !

శ్లో || అహింసా సత్య మస్తేయం బ్రహ్మచర్యం దయా22ర్జవమ్ |

క్షమా ధృతి ర్మితాహారః  శౌచం చేతి యమా దశ ||  ( దేవీ భాగవతం – దేవీ గీతలు )

యమములు పది రకాలు :

౧) అహింసా : ఇతరులను శారీరకంగా గానీ, మాటలతోగానీ, మానసికంగా గానీ హింసించకుండుట. అనగా,  ఇతరులకు ఏవిధమైన కష్టనష్టములు కలిగించకుండుట.

౨) సత్యం : నిజమునే పలుకుట. పరుల హితమునకు భంగము కలుగు సందర్భములలో

సత్యమే చెప్పవలెననే నియమము లేదు. మనస్సులో అన్యథా భావిస్తూ, వాక్కులో మాత్రం

నిజం ఉన్నా ( కాపట్యం ఉంటే ), అది సత్యవాక్కు కానేరదు.

౩) అస్తేయం :  దొంగతనం చేయకుండుట. మనసులో కూడా అట్టి భావన రానీయకుండుట. అనగా, పరుల సొమ్ముకు ఆశ పడకుండా ఉండుట.

౪) బ్రహ్మచర్యం : ముఖ్యార్థము పరబ్రహ్మము ( పరమాత్మ ) నందు మనస్సుతో విహరించుట. సాధనలో – బ్రహ్మచర్యము అనగా, జీవానికి, ప్రాణశక్తికి మూలమైన వీర్య-రక్షణము. వివాహాత్ పూర్వం ఉన్న బ్రహ్మచర్యాశ్రమంలోనే గాక, వివాహమైనాక వచ్చే గృహస్థాశ్రమంలో కూడా, కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటే బ్రహ్మచర్య-పాలన చేసినట్లేనని

పురాణాది శాస్త్రాలద్వారా, ఋుల ఉద్బోధ ! దానివలన ఓజస్సు, తేజస్సు, మేథా శక్తి పెరిగి, యోగ్యులైన సత్సంతానాన్ని పొందే అవకాశం పెరిగి తీరుతుంది; ఉన్నత లక్ష్యాల సాధనకు అవసరమైన శక్తియుక్తులు అలవడతాయి కూడా.

౫) దయా : జాలి, సానుభూతి; పరులకు ఎట్లా సహాయ పడగలమా అన్న తపనతో కూడిన ఆచరణ.

౬) ఆర్జవం : ఋజుత్వం. వక్రత లేకుండటం. నిష్కపటంగా ఉండటం. త్రికరణ శుద్ధి కలిగి ఉండటం. అనగా – మనో-వాక్కాయ కర్మలలో ఏకీభావం ఉండటం.

౭) క్షమా : సహనం, ఓర్పు కలిగి ఉండటం. వారిని నిమిత్తమాత్రులుగా భావించి, క్షమించే గుణం కలిగి ఉండటం.

౮) ధృతిః : ధైర్యం కలిగి ఉండటం. కష్టములు, ఆపదలు వచ్చినా  చలించకుండా స్థిరంగా నిలబడ గలగటం. ” నాకు అండగా దేవుడుండగా, నాకేల యితర చింతలు ” అనే స్థైర్యం !

౯) మితాహారః : ఆహార నియమములు పాటించుట. అనగా  న్యాయార్జితమైన  ధనముతో

సంపాదించిన ఆహారమును సేవించుట. రుచికన్నా ముఖ్యంగా శుచిగా, పథ్యంగా, హితకరంగా ఉన్న ఆహారాన్ని మితంగా ( తగు పరిమాణంలో ) సేవించుట. ధ్యానం సిద్ధించటానికి ఇది కూడా చాలా అవసరం.

౧౦) శౌచం : శుద్ధి; పరిశుద్ధత.  బాహ్య శుద్ధి; అంతశ్శుద్ధి. స్నానాదులు, త్రిపుండ్ర ( భస్మ, తిలక )ధారణలు మొ. వాటివల్ల బాహ్య శారీరక శుద్ధి కలుగుతుంది. మనస్సుయొక్క మాలిన్యాలు పోగొట్టుకుంటే అంతఃకరణ శుద్ధి అనేది వస్తుంది.

సర్వ మానవులకూ సహజంగానే మనస్సులో  -

సంకుచితత్వం ( స్వార్థం );

బహిర్ముఖత్వం;

చాంచల్యం;

అనే మూడు దోషాలు ఉంటాయి .

ఈ దోషాలు పోవాలంటే, వాటికి వ్యతిరేకమైన ఈ క్రింది మూడు విషయాలను ప్రయత్న పూర్వకంగా సాధన చేయాలి:

విశాలత్వం ( ఉదారత్వం, పరహిత-కామన )-(ఈశ్వరార్పణ బుద్ధితో చేసే నిష్కామకర్మల వల్ల వస్తుంది.);

అంతర్ముఖత్వం – ( దేహ, ఇంద్రియ, ప్రాణ, మనో, బుద్ధులను దాటి, బుద్ధిసాక్షి వరకు ప్రయాణం );

ఏకాగ్రత. ( ధ్యానం,  ఉపాసనల వల్ల వస్తుంది. )

నా ఆధ్యాత్మిక స్థాయి ఏమిటి ? నాకు తగిన సాధన అంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని

కింకర్తవ్యతా విమూఢతతో కాలవ్యయం చేసేబదులుగా, అన్ని సాధనలకూ మొదటి సోపానమైన ఈ ” యమ – దశకము ” ను భావనాత్మకంగానూ, ఆచరణాత్మకంగానూ అలవరచుకుంటే, సాధనకు బలమైన పునాది పడినట్లే గదా !

NOTE : Please click on the title ” SANATANA SAADHAKA SAMASHTI ” at the top of this POST, to get a view of the side-bar. Then you may click on other related topics also for more insight.

టాగులు: , , , , ,

4 స్పందనలు to “అష్టాంగ యోగం – 1 ( యమం )”

  1. rathnamsjcc అన్నారు:

    ఓo
    శ్రీ సద్గురవే నమః
    అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాం

    బొల్లా పెద్ద చెన్నయ్య
    బాలయ పల్లె

    ఆత్మ జ్ఞానం

    ఈ ఆత్మ చైతన్యం స్ధితి ఉపదేశము. తన సహజ స్ధితియైన ఆత్మలోఎరుక చైతన్యం నుండి విడిపోకుండ చూడటమే ఉపదేశ రహస్యము. అనీ తానై ఉన్నాననే నిజాన్ని తెలుసు

    .అన్నిటికన్నా ఉత్తమమైన మానవ జన్మ పొందడము సామాన్యము కాదు, మానవ జన్మ దుర్లభమని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాని మానవ జన్మ మన పూర్వ జన్మలలో చేసిన పాప పుణ్యఫలము, కాని అదే ఆ అన్ని జన్మలకీ ఫలము
    .మానవజన్మే చాలా గొప్పది. దాంట్లో, మానవులనేకమంది ఉన్నారు, ముముక్షుత్వం అంటే మోక్షవాంఛ కలిగి ఉండడం చాలా అరుదు. కానీ మహాత్ములయొక్కసద్గురు అనుగ్రహమూ, సద్గురు యొక్క సందర్శనము, సద్గురు
    ఉపదేశము మనకు ఎలా లభిస్తాయి? ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు మనస్సు ” మూలం. కనుక మానవుడు ముందుగా సద్గురు ను ఆశ్రయించక తప్పదు.
    ఆత్మ “జ్ఞానం” సంపాదించాలి..ఆత్మసత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి … కానీ ధ్యానం వగైరా సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం

    ఆత్మ సత్యం అంటే ఏమిటో అన్వేషిస్తున్నారా? ఆత్మ సత్యం అనేది ఎక్కడో దూరంగా ఉండే విషయం కాదు,అది ఇక్కడే ,ఇప్పుడే అందుబాటులో ఉంది..సముద్రంలో ఉండే ఒక చేపను సముద్రం ఆవరించుకుని ఉన్నట్లుగానే , ఆత్మ సత్యం మన చుట్టు ఆవరించుకుని ఉంది.సముద్రంలో ఉండే చేపకు సముద్రం గురించిన ఎరుక ఎప్పటికి ఉండకపోవచ్చు . సముద్రం గురించి తెలిసిన వెంటనే చేపకు ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది. దేన్ని గురించి తెలుసుకోవాలన్నకూడా ఆ వస్తువుకు , దానిని చూసేవారికి మధ్యన కనీసం కొంత దూరం ఉండాలి.అప్పుడే కనిపించే దానిని గురించిన జ్ఞానం చూసేవారికి కలుగుతుంది. సముద్రంలోనే అంతర్భాగంగా ఉన్న చేపకు అలా సముద్రాన్ని గురించిన ఎరుక ఏనాటికి కలుగకపోవచ్చు.
    ఆత్మ సత్యం పరిస్థితి ఇదే. ఆత్మ సత్యమే దేవుడు. దేవుడి పరిస్థితి కూడా ఇదే.అతను మనకు అతి సమీపంలో,మనల్ని పర్యవేక్షించి ఉన్నాడు. ఆత్మలో ఎరుక చైతన్యం సత్యం,దేవుడు సమీపంలో ఉందనడం కూడా సరికాదు.అది మీరే కనుక. ఆత్మలో ఎరుక చైతన్యం సత్యం,దేవుడు మీరై ఉండి మీలోపల,బయట కూడా పర్యవేక్షించి ఉన్నాడు.
    ఆత్మలో ఎరుక చైతన్యం సత్యమే ఉంది అనేది మొదటి సత్యం. ఆత్మలో ఎరుక చైతన్యం

    ఆత్మలో ఎరుక చైతన్యం సత్యం,దేవుడ్ని దర్శించకుండా ఉంచే అతి పెద్ద ప్రతిబంధకం మనస్సే. మిమ్మల్ని మాయాతెరలాగ చుట్టుముట్టి భౌతిక ప్రపంచ అందాలకు మిమ్మల్ని పరవశ్యులను చేస్తుంది.
    ఆ మనస్సు మాయలో లీనమైపోయి సత్యాన్ని మర్చిపోతున్నారు. నిరంతరం కలలు గనేది, కల్పనలు,ఆశలు,ఆశయాలు,కోరికలే ఆలోచించేదే మనస్సు. నిజానికి లేనిదల్లా మనస్సే. కాబట్టి దేవుడ్ని తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకం అంతా మనస్సే. ఈ ప్రపంచమొక దేహము, ఇంద్రియములు, మనస్సు బుద్ధి మొదలైనవి దృశ్యాదృశ్యములు అవి తానుగాదు ఆత్మ యొక్కటే తానగుచున్నది అంటే మనస్సును ఖాళిగా ఉంచడం.అంటే ఆలోచనలు ఏమిలేని మనస్సు అని అర్థం.అన్ని మతాల సారాంశం అంతా ఈ ఆత్మ స్థితికోసమే. ఈ ఆత్మ స్థితి సాధించడమే
    దేవుడ్ని తెలుసుకునే మహాద్వారం. అంటే కనిపించేవన్ని,అనుభవంలోకి వచ్చేవి,ప్రపంచంలోని సర్వస్వం కూడా కలలవంటివే అనుకోండి.

  2. rathnamsjcc అన్నారు:

  3. padam ramu అన్నారు:

    very good

  4. sastry అన్నారు:

    chala bagunnadi
    telugulo
    rastunnaduku chala anandaga unnadi
    telugu bhakti article english lo vastnnai –koncem kastam ga unndi
    vallla ki meeru cheppandi ;nenu cheppite vindam ledu

    namskaramulu
    sastry

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.